అవస్థలు పడుతున్న రోగులు
నవతెలంగాణ--చేర్యాల
మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో ధీర్గాకాలిక వ్యాధులను నయం చేస్తూ రోగులకు దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా వైద్య సేవలందిస్తున్న హోమియోపతి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది లేక మూతపడిందని గ్రామ పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి పుల్లని వేణు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో హోమియో వైద్యురాలు డిప్యూటేషన్ పై వెళ్లి అక్కడినుంచే పదోన్నతి పొంది సంగారెడ్డికి వెళ్లారని, అప్పటి నుంచి కనీసం మందులిచ్చేవారు కూడా కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, మంత్రిని కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటే స్పందించిన అధికారులు.. మందులు, ఫర్నిచర్ ను గ్రామానికి తరలించారని, వాటిని ఆరోగ్య ఉపకేంద్రం పక్కన ఉన్న గదిలో ఉంచారని తెలిపారు. నిత్యం రోగులతో నిండుగా ఉండే ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో నిరూపయోగంగా మారిందన్నారు.దీనితో అందులో ఉన్న మందులు పాడైపోతున్నాయని, సంబందిత అధికారులు స్పందించి వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 04:18PM