నవతెలంగాణ కంటేశ్వర్
హైదరాబాద్ కేంద్రంగా గచ్చిబౌలిలో ఆకుల లలిత నివాసంలో జరిగిన మున్నూరుకాపు మహిళా విభాగం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన మున్నూరుకాపు మహిళమానులందరు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళ విభాగం కోర్ కమీటీ అడ్ హాక్ కమిటీ లను నిర్ణయించడం జరిగింది. ఆకుల లలిత మహిళ విభాగం చెర్మెన్ గా, 9 మంది సభ్యులుగా నిర్ణయించడం జరిగింది. మున్నూరుకాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహిళా చెర్మెన్ ఆకుల లలిత ఆధ్వర్యంలో రాష్ట్ర అడ్ హాక్ కమిటీ కన్వీనర్ గా ఇద్దరినీ కో కన్వీనర్ గా ఒక్కరిని నిర్ణయించడం జరిగింది. బండి పద్మ పటేల్ బోనాల శ్వేత పటేల్, కో కన్వీనర్ గా మెతుకు హేమలత పటేల్ ని నియమించడం పట్ల మహిళమానులందరు హర్షం వ్యక్తం చేశారు. వీరు మూడు నెలలలో 10,000 మంది మెంబర్షిప్ లు చేసి జిల్లా మండల నియోజకవర్గాలలో కమిటీలు వేసి గౌరవ చెర్మెన్ ఆకుల లలిత, కొండ దేవయ్య కి అప్పగించాలని తర్వాత వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీలు వేయడం జరుగుతుందని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఆకుల విజయ, కొంతం దీపిక, ఆడం ఉమ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 05:59PM