నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
అక్కన్నపేట నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వివేక్ గురువారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో సిఐ రఘుపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి కలవాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm