నవతెలంగాణ నవీపేట్
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తహసీల్దార్ లత గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల లోని ఏ, బీ కేంద్రాలతో పాటు బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని నిర్వాహకులను సూచించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా చూడాలని అన్నారు. పరీక్షలకు 665 మంది విద్యార్థులకు గాను 662 మంది విద్యార్థులు హాజరుకాగా ముగ్గురు గైర్హాజరైనట్లు ఎమ్మార్వో లత తెలిపారు. ఆమె వెంట రెవెన్యూ అధికారి మోహన్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm