నవతెలంగాణ-చిన్నకోడూరు
మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వ్యక్తి కి న్యాయస్థానం 3రోజుల జైలు శిక్ష, రూ.2వేలు, ఈ- పెట్టి కేసులో రూ.350 జరిమానా విధించినట్లు చిన్నకోడూరు ఎస్ఐ శివానందం తెలిపారు. చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా చిన్న కోడూరు గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడగా న్యాయస్థానం శిక్ష విధించింది.
Mon Jan 19, 2015 06:51 pm