ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలరాలిన చెట్లు..
ప్రయాణికులకు తీవ్ర అంతరాయం...
నవతెలంగాణ: నవీపేట్
మండలంలో ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన కురవడంతో రోడ్లపైన గురువారం చెట్లు నేలకొరిగాయి. మండలంలోని నాగేపూర్, కోస్లీ గ్రామాలలో వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో బాసర వెళ్ళు రోడ్డుమీద చెట్లు నేలకొరిగాయి. చెట్లు రోడ్లపై పడడంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ సాయంతో చెట్లను తీసివేశారు. లింగాపూర్ గ్రామంలో గంధం రజిత ఇంటి రేకులు ఈదురు గాలులకు ఎగిరి పోవడంతో నిత్యావసర వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. అలాగే ఆరబెట్టిన ధాన్యంతో పాటు కాంటా చేసిన బస్తాలు మరియు లారీలలో లోడ్ చేసిన బస్తాలు అన్ని తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 08:00PM