నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ప్యాకేజీ 21 పనులు త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గా సర్పంచుల ఫోరం అధ్యక్షులు అంతరెడ్డి మోహన్ రెడ్డి గురువారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ( ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం ) నిర్మించతలపెట్టిన విషయం విదితమే దానికి దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఇజ్రాయిల్ దేశం లో ఉన్నటువంటి సాంకేతికతను స్వయంగా వీక్షించి పైపు లైన్ ద్వారా సాగు నీరు నిజమాబాద్ రూరల్ నియోజకవర్గానికి అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఒప్పించారు అని అన్నారు. కాలువ ద్వారా నీరు ఇస్తే చాల మంది రైతులు తమ భూములను కోల్పోవలసి వస్తుందనే ఉద్దేశంతో పైపు లైనుల ద్వారా సాగునీరు కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగిందని అన్నారు. కానీ కొంత మంది రాజకీయ నాయకుల దురుద్దేశంతో నిజామాబాదు రూరల్ రైతాంగానికి సాగునీరు అందిస్తే తమ పప్పులు ఉడకవని రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వాస్తవానికి మంచిప్ప గ్రామం ముంపుకుగురి కానప్పటికీ మంచిప్ప గ్రామ ప్రజలను రెచ్చగొడుతూ అక్కడికి పనులు కొనసాగకుండా అలజడి సృష్టిస్తున్నారు అని అన్నారు. మంచిప్ప రిజర్వాయర్ పనులను ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని, కావున నిజమాబాద్ రూరల్ నియోజకవర్గం రైతాంగం తరపున అన్ని గ్రామాల సర్పంచులందరం ముక్త కంఠంతో తమారితో మనవి చేయునదిని అని, అన్నారు. బహుల ప్రజల ప్రయోజనాల దృష్టా కాళేశ్వరం ప్యాకేజీ 21 పనులను త్వరితగతిన పూర్తి అడ్డంకులను తొలగించి నిజామాబాద్ రూరల్ రైతాంగానికి సాగు నీరు అందించాలని కోరారు. లేని యెడల నియోజకవర్గ రైతాంగాన్ని ఏకం చేసి రైతాంగా పోరాటాలకు సైతం వెనుకడబోమని ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరిస్తున్నామని అన్నారు. మంచిప్ప, పరిసర గ్రామాల ప్రజలకు రైతాంగా ప్రయోజనాల దృశ్య సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము అని, ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, జక్రాన్ పల్లి మండల అధ్యక్షుడు పుప్పల శ్రీనివాస్, ధర్పల్లి మండల అధ్యక్షుడు శేఖర్, సిరికొండ మండల అధ్యక్షుడు రమేష్, ఇందల్వాయి మండల అధ్యక్షులు మోహన్ నాయక్, రూరల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్, మోపాల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 08:02PM