నవతెలంగాణ కోడేరు
మండల పరిధిలోని రేకుల పల్లి గ్రామంలో పాత బోరు నుండి తాగు నీరు సరఫరా కాకపోవడంతో నలభై ఐదు వేల రూపాయల తో సర్పంచ్ లాల్సింగ్ కొత్త బోరు మోటారు వేయించారు. దీంతో తాగునీటి కొరత తీరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కమలమ్మ, వార్డు మెంబర్ హనుమంతు నాయక్, గ్రామ అధ్యక్షుడు పాపియ్య నాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రాజు నాయక్, డాకియ్య నాయక్, బాలు, లక్ష్మణ్ నాయక్, స్కూల్ చైర్మన్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm