నవతెలంగాణ-మంథని
రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి పార్టీ అధికారం చేపడుతుందని, మంథనిలో గెలుపే లక్ష్యంగా బిజెపి పార్టీ కార్యకర్తలు,నాయకులు, పనిచేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, కొండాపురం జగన్ లు అన్నారు.బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోని ఏ.ఎల్.ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ మంథని నియోజకవర్గ కేంద్రాల ఇన్ చార్జ్లు,బూత్ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిల సమావేశంలో ముఖ్య అతిధులుగా వారు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ కోసం ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు,శక్తి కేంద్రాల ఇన్ చార్జులు,మండల ఇన్ చార్జిలు,మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో చేరడానికి యువత ముందుకు వస్తున్నారని,నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగర వేయడం ఖాయమన్నారు. జూలై 3న ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంథని నియోజకవర్గం నుండి పదివేల మంది తరలి వెళ్లాలని వారు పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశం కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ముందుంచారని,మోడీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త ముందుకుపోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బండి శరత్ కుమార్,మండల అధ్యక్షులు వేల్పుల రాజయ్య,టౌన్ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్,ప్రధాన కార్యదర్శులు తోట మధుకర్, వీరబోయిన రాజేందర్,సబ్బని సంతోష్ సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్,బోయిని నారాయణ,నాంపల్లి రమేష్,చిలువేరి సతీష్,మేదరవేన రవి, పోతరవేణి క్రాంతి కుమార్,బూడిద రాజు,మట్ట శంకర్,జెంగపల్లి అజయ్,బిరుదు గట్టయ్య,మల్లారపు అరుణ్,మచ్చగిరి రాము, మాదారబోయిన కుమారస్వామి,ఎడ్ల సాగర్,అన్ని మండలాల బూత్ అధ్యక్షులు,శక్తి కేంద్రం ఇంచార్జ్ లు, పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jun,2022 07:37PM