నవతెలంగాణ డిచ్ పల్లి.
తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సి బి సి ఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూ లర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రోఫేసర్ డాక్టర్ ఎం. అరుణ బుధవారం తెలిపారు. ఉదయం జరిగిన నాలుగో సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 10933 నమోదు చేసుకోగా 10058 మంది హాజరు, 875 మంది గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు. మధ్యాహ్నం జరిగిన రెండో సెమిస్టర్ రెగ్యూలర్, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 12852 నమోదు చేసుకోగా 11924 మంది హాజరు, 928 మంది గైర్హాజరు అయినట్లు ఆమె పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jun,2022 07:42PM