-8 మంది సర్పంచులు,6 ఎంపీటీసీలతో ప్రారంభమైన సర్వసభ్య సమావేశం
-విద్యాశాఖపై సర్పంచ్ మొండయ్య,ఎంపీటీసీ రాజు ఆగ్రహం
-శిథిలావస్థలో ఉన్న చీలాపూర్ పాఠశాలపై ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు- సర్పంచ్ మొండయ్య ఆగ్రహం
-దాచారం ఆరోగ్య ఉప కేంద్రంలో బీపీ యంత్రాలేవని ఎంపీటీసీ రాజు ఆగ్రహం
-దాచారంలోని 124 రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంపీటీసీ రాజు సూచన
-గైర్హాజరైన విద్యుత్ శాఖాధికారులు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని చీలాపూర్ ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని.. విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడం వల్ల అలాగే భోధనకు ఒక్కగది ఉండడంతో ఈ విద్యాసంవత్సరం సూమారు 34 మంది విద్యార్థులు ఇతర పాఠశాలకు వెళ్లిపోయారని సర్పంచ్ మొండయ్య, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవని ఎంపీటీసీ కొలిపాక రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యలయంలో ఎంపీపీ లింగాల నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం 8 మంది సర్పంచలు,ఆరుగురు ఎంపీటీసీలతో ప్రారంభమవ్వగా విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షలో సర్పంచ్ రాగుల మొండయ్య, ఎంపీటీసీ కొలిపాక రాజు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సర్వసభ్య సమావేశం రసాభాసాగ మారింది. ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పథకాల్లో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయలోపం వల్లే ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తలేత్తున్నాయని..సమీక్షా సమావేశంలో ఆయా శాఖల అధికారులు క్లుప్తమైన వివరాలతో హజరవ్వాలని ఎంపీడీఓ దమ్మని రాము సూచించారు.విద్యుత్ శాఖాధికారులు సమావేశానికి గైర్హాజరవ్వడం విశేషం.
రసాభాసాగ సర్వసభ్య సమావేశం..
ఆరోగ్య శాఖ,విద్యాశాఖ అధికారుల సమీక్షా సమావేశంలో అధికారులపై సర్పంచ్ రాగుల మొండయ్య, ఎంపీటీసీ కొలిపాక రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండేండ్లుగా చీలాపూర్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేసానని..శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు మొదటి విడత మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రాధాన్యత ఇవ్వకుండా మెరుగ్గా ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేయడం అధికారులు పక్షపాత దోరణిని అవలంబించడమేనని ఆరోపించారు. ఒక్కగది ఉండడంతో విద్యార్థులు ఇతర పాఠశాలలకు తరలిపోతున్నారని సర్పంచ్ మొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల్లో కనీస సౌకర్యాల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఎంపీటీసీ కొలిపాక రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాచారంలోని 124 సర్వే నంబర్ యందు భూములు కోల్పోయి ఎదురుచూస్తున్న ఆర్హులైన రైతులకు రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో మళ్ళీ విచారణ చేపట్టి న్యాయం చేయాలని,తోటపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలోని దాచారం ఆరోగ్య ఉప కేంద్రం సకల సౌకర్యాలున్న గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ కార్యలయంలో సిబ్బంది వైద్య సేవలందిస్తున్నారని.. బీపీ పరీక్షకు కోసం వేళ్తే యంత్రం పని చేయడం లేదని ఎఎన్ఎం నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని డాక్టర్ కీర్తనను ప్రశ్నించారు. దాచారం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిందని అధికారులు త్వరితగతిన స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఎంపీటీసీ రాజు కోరారు. శిథిలావస్థలో ఉన్న చీలాపూర్ పాఠశాలపై నివేదికను పై అధికారులకు అందజేశానని, అదనపు బాధ్యతల నిర్వహిస్తునే పై అధికారుల అధేశానుసారం శాయశక్తుల పని చేస్తున్నానని ఎంఈఓ పావని వివరణ ఇచ్చారు.దాచారం ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డాక్టర్ కీర్తన వివరణ ఇచ్చారు.మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి,సర్పంచులు సీతాలక్ష్మి,పెండ్యాల బాపు రెడ్డి,ఐలయ్య,మొండయ్య, లింగా రెడ్డి, నర్సింగరావు,సంజీవరెడ్డి,సత్యనారాయణ రెడ్డి,తిరుపతి, ఎంపీటీసీలు గుభిరే శారధ,ముక్కీస పద్మ, ఎలుక లత, పోతిరెడ్డి స్రవంతి, నల్లగొండ లక్ష్మి,కొలిపాక రాజు, కొమిరే మల్లేశం, అయా శాఖల అధికారులు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jun,2022 08:09PM