-టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షురాలును సందర్శించిన కవ్వంపల్లి
-తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే వాఖ్యలు నిలుపుకోవాలని డిమాండ్
-గుగ్గీల్లలో మృతుడి కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలంలో పని చేసిన వారికి అధికార పార్టీలో అన్యాయమే జరుగుతుందని..అభివృద్ధి పేర టీఆర్ఎస్ మాజీ మండలాద్యక్షురాలు ఇరుముల్ల సుగుణ ఇల్లును గత ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ నాయకులు కూల్చివేతకు గురి చేసి అన్యాయం చేయడం సరైందికాదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాద్యక్షుడు,మానకొండూర్ నియోజకవర్గ ఇన్ చార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలో అద్దె ఇంట్లో నివాసముంటున్న టీఆర్ఎస్ మాజీ మండలాద్యక్షురాలు ఇరుముల్ల సుగుణను స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కవ్వంపల్లి సత్యనారాయణ.. జరిగిన అన్యాయం గూర్చి వివరాలడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు ప్రభుత్వం ఎళ్ళవేలలా అండగా ఉంటుందని వాఖ్యలు చేసే ఎమ్మెల్యే.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతానకి శాయశక్తుల కృషి చేసిన ఆడబిడ్డ సుగుణకిచ్చిన హామీని నిలుపుకోకుండా కాలం వెళ్లదీయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న వాఖ్యలను.. బాధితురాలికి ఎమ్మెల్యే డబుల్ బెడ్ రూం అందజేసి నిలుపుకోవాలని కవ్వంపల్లి సూచించారు. అనంతరం గుగ్గీల్ల గ్రామానికి చెందిన తిప్పరవేని కనుకయ్య గల్ప్ దేశంలో మృతి చెందగా కవ్వంపల్లి సత్యనారాయణ.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, దోనే వెంకటేశ్వర్ రావు,మంద శేఖర్ గౌడ్,చెప్యాల సారయ్య గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jun,2022 09:09PM