నవతెలంగాణ కన్నాయిగూడెం
ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కన్నాయిగూడెం మండలంలోని కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశానుసారం ప్రతి నెల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆస్పత్రుల యందు నిద్ర చేయాలనే ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కన్నాయిగూడెం వైద్యాధికారి, డాక్టర్ నవీన్, ఆస్పత్రి సిబ్బందితో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కన్నాయిగూడెంలో నిద్రచేశారు.అలాగే జిల్లా వైద్యాధికారి అప్పయ్య కన్నాయిగూడెం పి హెచ్ సి పరిధి లోని గుట్టల గంగారం గ్రామంలో పర్యటించి రాబోయే సీజనల్ వ్యాధుల పట్ల అందరు అవగాహనా కలిగి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అలాగే మళ్ళీ కరోన కేసులు పెరుగుతున్నందున అందరు తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు. గ్రామస్థులకు వైద్యాధికారి అప్పయ్య మాస్క్ లు పంపిణి చేయడం జరిగింది. అలాగే మండల కేంద్రంలో ర్యాలీగా చేస్తూ పరిసరాల పరిశుభ్రత మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
తదనంతరం వైద్య సిబ్బంది ఆశా, ANM లకు సమీక్ష సమావేశం నిర్వహించి,గర్భిణీ లు ప్రభుత్వఆసుపత్రి లో నే ప్రసవం అయ్యే విధంగా చూడాలని, ANC రిజిస్ట్రేషన్ సరిగా జరిపి KCR KIT ఇప్పించాలని, NCDA స్క్రీనింగ్ సక్రమంగా జరిగేలా చూడలన్నారు. అలాగే రాబోవు సీజనల్ వ్యాధులకు అనుగుణగా మందులు సమాకుర్చుకొని సమయపాలనా పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
అనంతరం కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక వైద్యాధికారి డాక్టర్ నవీన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య హాజరయ్యారు. అలాగే సర్పంచ్ లలిత, మండల పరిషత్ ప్రెసిడెంట్ సమ్మక్క,ఎం పి టి సి నర్సక్క హాజరు కావడం జరిగింది. ఆసుపత్రి అభివృద్ధి గురించి పలు తీర్మానాలు చేయడం జరిగింది. ,ఆస్పత్రిలో,కార్పెంటర్ వర్క్ కు సంబంధించి ఆసుపత్రి క్లీనింగ్ కు ఉపయోగించే పరికరాల కొనుగోలు గురించి ఆసుపత్రిలో త్రాగునీటి సౌకర్యము ఏర్పాటు చేయడం గురించి మరియు ఇతర సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ అల్లి నవీన్, CHO దుర్గారావు, HE తిరుపతయ్య సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహా రావు, హెల్త్ అసిస్టెంట్లు ఓం ప్రకాష్ , లక్ష్మణ్ , భాస్కర్, ఫార్మాసిస్ట్ గంగాధర్, సురేష్ ఆశా ANM లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jun,2022 06:06PM