మద్నూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఎం ఈ ఓ కు వినతి పత్రం
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలం లో గల ప్రయివేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు రాయితీ కల్పించాలని శనివారం మద్నూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం డిమాండ్ చేసింది. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో ఎంఈఓ కార్యాలయంలో విధులు నిర్వహించే రవికి వారు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మద్నూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు ఎస్ హనుమాన్లు మాట్లాడుతూ మద్నూర్ మండలంలో గల ప్రయివేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించడానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఎంఈవో కార్యాలయం అధికారి రవి సమాధానమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు రాగానే ప్రయివేటు పాఠశాలలు వెంటనే రాయితీ కల్పించేందుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గం సభ్యులు, మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 04:45PM