మాజీ మంత్రి షబ్బీర్ అలీ
నవతెలంగాణ భిక్కనూర్
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. శనివారం మండలంలోని భగీరథి పల్లి ఈ సన్న పల్లి ర్యాగాట్లపల్లి సిద్ది రామేశ్వర నగర్ గర్జకుంట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, ఇండ్లు రావడం లేదని మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్అలీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు. వరి పంట సాగు చేస్తే ఉరి అని సీఎం కేసీఆర్ చెప్పి ఆయన ఫాంహౌస్ లో వరి పంట సాగు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడం వల్లనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకు తింటుందని ఆరోపించారు. రైతులు ఏ పంటలు సాగు చేసినా గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మద్దతు ధర పెంచుతూ రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. చెరుకు పంట సాగు చేసి బెల్లం తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సబ్స్టేషన్ నిర్మించడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పింఛన్లు ఇండ్లు ఇవ్వకుండా పేద ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వం హయాంలో ఏ గ్రామంలో కూడా శాశ్వతంగా నిలిచే అభివృద్ధి పనులు జరగలేదని ఆయన చెప్పారు. మాయ మాటలు చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయహస్తం పింఛన్లు రద్దు చేయడం వల్ల డాక్రా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గతంలో సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.. దానిని రద్దు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి రద్దు చేసినా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదన్నారు. మాయమాటలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలపాలని ఇందుకోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. పలు గ్రామాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు భీంరెడ్డి మండల బీసీ సెల్ అధ్యక్షులు వడ్ల తిరుమల స్వామి, రైతు విభాగం అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు యాద గౌడ్, భాగయ్య, సంజీవరెడ్డి, అనిల్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, డి సి సి బి మాజీ చైర్మన్ ఎడ్ల రాజి రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి లింబాద్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నయీమ్ ఇలియాస్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బాగా రెడ్డి, సుదర్శన్, నర్సింగరావు, అశోక్ కిరణ్, కుమార్, సిద్ధార్థ్ గౌడ్, అశోక్ రెడ్డి, మద్దూరి, రవి లింగారెడ్డి, అనిల్ రెడ్డి, రాజిరెడ్డి, బాల్రెడ్డి శ్రీనివాస్ గోపాల్ రెడ్డి చంద్రం రాజయ్య లక్ష్మణ్ రాజు అశోక్ రెడ్డి రాములు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:06PM