నవతెలంగాణ - అశ్వారావుపేట
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శనివారం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. హైదరాబాద్ లోని బంజర హిల్స్ లో రేణుకా చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిసిన తాటి వెంకటేశ్వర్లు ఆమెకు పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి తాటి వెంకటేశ్వర్లు సేవలు అవసరమని తెలిపారు. పార్టీలో చేరిన తాటి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm