- పిఎసిఎస్ చైర్మన్ మారి నేని సుధీర్ రావు
నవ తెలంగాణ చివ్వేంల : రైతులు తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ మారినేని సుధీర్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా సహకార కేంద్రశీ బ్యాంక్ ( చీణజజదీ) ద్వారా కోటి రూపాయలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించకపోతే జప్తు చేసే అవకాశం ఉందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలు సకాలంలో చెల్లించిన వారిని సంఘం ద్వారా రివార్డ్ అందజేసి సన్మానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ సైదులు, సిఈఓ శ్యాశీసుందర్ రెడ్డి, డైరెక్టర్లు గుగులోతు శ్రీను, సలీం, పత్తిపాక వెంకటేశ్వర్లు, ధరావత్ రమేష్, పందిరి గోవిందరెడ్డి రైతులు గోగుల శ్రీను, మిర్యాల గోవిందరెడ్డి, బ్యాంక్ సిబ్బంది కృష్ణారెడ్డి, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jun,2022 04:32PM