- ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్
నవ తెలంగాణ కంటేశ్వర్
గ్రంధాలయాలు సమాజానికి అవసరమని ఎస్టియు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా గ్రందలయంనకు స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్ టి యు టి ఎస్) తరుపున నిరుద్యోగుల కోసం బుక్స్ విరాళంగా ఇవ్వడం జరిగింది అని ఎస్టియు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రంధాలయ సంస్థ అధికారులు ఇలాంటి కార్యక్రమాలు నిరుద్యోగులకు ఉపయోగపడుతాయని, గ్రంధాలయాలు కూడా పరిపుష్టి అవుతాయి అని అన్నారు.జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ లైబ్రరీ అనేది ప్రతి ఒక్కరికీ ఉపయోగకరం,సమాజంలో చైతన్యం తెచ్చేది పుస్తకం అని ఈ లైబ్రరీ లోనే నేను ఉద్యోగాల కోసం చదువుకున్న అని అలాంటి లైబ్రరీకి బుక్స్ ను ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అఫ్జల్ బెగ్, ఏ.శ్రీనివాస్,మహేశ్వర్,పవన్ కుమార్,కాంతారావు ,ఖలిముద్దిన్,తదితరులు పాల్గొన్నారు.