- బిరస ముండా యూత్ అధ్యక్షులు రేగ రాజశేఖర్
నవతెలంగాణ- తాడ్వాయి
బిర్సా ముండా యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చందా తరుణ్ మృతి బిరసముండా యూత్ కు తీరంలోటని బిర్సా ముండా యూత్ అధ్యక్షులు రాజశేఖర్ అన్నారు. ఆదివారం తాడ్వాయి మండలం లోని కామరం గ్రామానికి చెందిన ఆదివాసులు బిడ్డ బిర్సా ముండా యూత్ నాయకులు మృతి చెందడం బాధాకరమన్నారు. కామారం గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివాసీల అస్తిత్వం చరిత్ర సంస్కృతి పై నిత్యం పరిశోధనలు జరుపుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న, బిరస ముండా యూత్ లో ఆర్గనైజింగ్ సెక్రెటరీ చందా తరుణ్ కిడ్నీ సమస్య తో మరణించటం తో వివిధ ప్రాంతాలలో విద్య నీ అభ్యసించే యూత్ సభ్యులు యునివర్సిటీ పరిశోధక విద్యార్థులు తుడుందెబ్బా నాయకులు ఈరోజు కామరం గామం చేరుకొని నివాళి అర్పించారు, యూత్ సభ్యుల్లో ఒకర్ని కోల్పోవడం యూత్ సభ్యులు జీర్ణించుకోలేక శోక సంద్రంలో లో మునిగారు. అనంతరం యూత్ అధ్యక్షులు రేగ.రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి చర్ప.రవి లు మాట్లాడుతూ చందా తరుణ్ మృతి బిరాస ముండా యూత్ కి తీరని లోటు అని అన్నారు, అతి తక్కువ కాలం లో చిన్న వయసులో యూత్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా సాంస్కృతిక కార్యదర్శి గా బాధ్యతలు చేపట్టి బిరస ముండా రీసెర్చ్ సెంటర్ దేశ వ్యాప్తంగా క్షేత్ర పర్యటనలో బాగంగా తరుణ్ సేవలు మరువలేనివి అన్నారు, విద్య పరంగా కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం విశాఖ పట్నం లో ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ పిజి లో సీటు పొందిన తరుణ్ ఉన్నత విద్య లో కూడా ముందు వరుసలో ఉన్నాడు అన్నారు, ఆదివాసి ఉద్యమం లో యువ కెరటం గా ఆదిలాబాద్ నుండి భద్ర చలం వరకు ఆదివాసి ప్రాంతాలలో తిరుగుతూ యువ నాయ కత్వ బాధ్యతలు చేపట్టిన తొలి దశ లో చనిపోవడం బాధ కరం అన్నారు.
బిరస ముండా యూత్ ఒక భవిష్యత్ లీడర్ నీ పరిశోధక విద్యార్థి నీ, ఆదివాసి యువ నేత నీ కోల్పోయింది అని అన్నారు. చందా తరుణ్ పేరు పై ఒక పౌండేషన్ నీ విద్య అభివృద్ధికి మొదలు పెట్టి అతని ఆశయం నీ కొనసాగిస్తాం అని యూత్ కమిటీ ప్రకటించింది. బిర్సా ముండా యూత్ కమిటీ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.