నవతెలంగాణ-భిక్కనూర్
గ్రామంలో ఎవరు మద్యం సేవించ వద్దని, గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపులన్నీ మూత పడాలని, ఇందుకోసం తాను సంపూర్ణ మద్దతుగా గ్రామస్తులకు అండగా ఉంటానని ఎంపిపి గాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో మద్యపాన నిషేధం పై బహిరంగ చర్చావేదిక నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎవరికి వారుగా తమ అభిప్రాయాలు వేదిక ద్వారా తెలియజేశారు. గ్రామంలో ఉన్నటువంటి 18 కులాలతో ఏర్పడిన గ్రామాభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పలువురు ఈ సందర్భంగా సూచించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా గ్రామ సచివాలయానికి ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాకాకుండా ముందస్తుగా అధికారులకు ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎంపిపి సుదర్శన్ ప్రశ్నించారు. గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకున్న గ్రామ సచివాలయానికి సమాచారం ఉండాలని తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ బెల్టుషాపుల నిర్మూలనపై చర్చా వేదిక పెట్టడం వల్ల పలు సమస్యలు తలెత్తాయని, పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గ్రామంలో ఉన్న యువత మద్యానికి బానిస వద్దన్నా ఉద్దేశంతో గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ సేవా సమితి ఈ నిర్ణయం తీసుకుంది, ఇట్టి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు హాజరై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దశరథం మాట్లాడుతూ గ్రామంలో బెల్టుషాపులు ఉండడంవల్ల అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయని, దీనివల్ల చాలామంది యువకులు మద్యం తాగి కుటుంబంలో గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఉండడం వల్ల తాను కుటుంబం ద్వారా ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, సభా వేదిక ద్వారా తన కొడుకు చేస్తున్న ఇబ్బందులను గ్రామస్తులకు వివరిస్తూ కంటతడి పెట్టారు. మద్యం షాపులు మూసివేస్తే చాలా మంది యువత తమ భవిష్యత్తు కోసం పాటుపడతారని సూచించారు. ఎంపీపీ గాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన వారు ఎవరు మద్యం తాగవద్దు అని అంతే కాకుండా పూర్తిగా మద్యం షాపులు మూసి వేస్తే తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వేదిక ద్వారా ప్రకటించారు గ్రామంలో ఉన్న యువత తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలని మద్యానికి బానిస కావద్దని ఆయన సూచించారు గ్రామంలో కొనసాగుతున్న బెల్టుషాపుల వల్ల పలు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. గ్రామంలో ప్రస్తుతం కొనసాగుతున్న బెల్టుషాపులు వచ్చే నెల 5 నుండి పూర్తిగా మూసివేయాలని ఈ సందర్భంగా సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిద్దా గౌడ్, గ్రామ రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రాజా గౌడ్, గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు గ్రామ సేవా సమితి సభ్యులు యువజన సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.