నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలో ఎక్కడైనా పాములు ఉంటే అక్కడికి పోయి పాములు పట్టే వ్యక్తి అదే పాము కాటుకు బలైన మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలోని బస్వాపూర్ గ్రామం లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గయ్య (39) గత కొన్ని సంవత్సరాలుగా పాములు పట్టి జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని వివేకానంద విగ్రహం వద్ద ఒకరి ఇంటికి పాము వచ్చిందని తెలపడంతో వెళ్లి చూడగా త్రాచుపాము అనీ నిర్ధారించుకొని పాముని పట్టి దుర్గయ్య సంచిలో దించుతూ ఉండగా ఒక్కసారిగా పాము కాటు వేయడంతో నురుగులు కక్కుతూ కిందపడిపోయాడు. గమనించిన గ్రామస్తులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా వారు వచ్చి చూసేసరికి దుర్గయ్య మృతిచెందినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. కాగా మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హైమద్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jun,2022 06:26PM