- గూణ పెంకలనే నమ్ముకున్న గిరిజనులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్రం వస్తే పేద ప్రజలు నివాస ఉండడానికి డబుల్ బెడ్రూం గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి నేడు నెరవేరకపోవడంతో దురదృష్టకరం. రాష్ట్రం రాకముందు రాజకీయ సమావేశాల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రకటించిన హామీలను మరిచిపోవడం హాస్యాస్పదమని ప్రజలు అంటున్నారు. దీనిలో భాగంగా నివాసము లేనివారికి భూమితోపాటు డబుల్ బెడ్ రూమ్ గృహాన్ని నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చేసింది. నివాస స్థలం ఉన్న వారికి గృహాన్ని నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని హామీ కూడా నిలబెట్టుకోలేకపోయింది. మండలానికి అరకొర గృహాలతో తూతూమత్రంగా పథకాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వ హామీల పై ఆశలు వదులుకున్న మండలం గిరిజన ప్రజానీకం పాతకాలపు గూణ పెంకుల నే నమ్ముకొని గృహాలను నిర్మించుకుంటుంది. మండల వ్యాప్తంగా నేతాజీ నగర్. పసర. బాలాజీ నగర్. గోవిందరావుపేట. చల్వాయి మచ్చాపూర్ గ్రామాలలో సుమారు 250 గృహాలు మంజూరు అయిన ఇప్పటి వరకు ఒకటి కూడా ప్రారంభానికి నోచుకోవడంలేదు. నేతాజీ నగర్ లో సగం నిర్మాణంలో ఉన్న సుమారు 50కి పైగా గృహాలను. బాలాజీ నగర్ లో 25 . మచ్చాపురంలో 20. గోవిందరావుపేట లో 50. పసర లో సుమారు 30. లబ్ధిదారులు స్వంత ఖర్చులతో పూర్తిచేసుకొని గృహప్రవేశం చేసుకొని నివాసాలు చేస్తున్నారు. వీటి పై ఆశలు వదులుకున్న మారుమూల గిరిజన లు మాత్రం సమీప అడవుల్లో దొరికే ఇల్లు నిర్మించుకుని గూణ పెంకులు కప్పుకొని నివాసం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై ఎంతో అభిమానాన్ని పెంచుకున్న గిరిజనులు ఇప్పుడు ఇప్పుడు అభిమానాన్ని తుంచు కుంటున్నారు. ఇక మాకు డబుల్ బెడ్రూం గృహాలు రావు అనే నైరాశ్యంలో వారు మునిగి ఉన్నారు. గిరిజనులకు నమ్మకం కల్పించడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే కవర్లు కప్పుకొని జీవించే గృహాలు వేల సంఖ్యలో గ్రామగ్రామాన ఉన్నాయి. ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రకటించుకోవడం భారత్ వెలిగిపోతోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన కొట్టడం హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రతి గ్రామాల వేలసంఖ్యలో ఇంకా గృహిణులు ఆరు బయట వర్షం చినుకులకు తడుస్తూ ఎండు తూ కట్టెల పొయ్యి పై వంటలు చేసుకునే వారు ఉన్నారు. ఇది బంగారు తెలంగాణ అంటే వారు పగలబడి నవ్వుతారు. బంగారు తెలంగాణ అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యుల మాటలలో ఉందని గిరిజనులు ముక్తకంఠంతో పలుకుతారు. డబుల్ బెడ్రూం గృహాలు తమకు దక్కుతాయని అన్న ఆశ ఇప్పట్లో లేదని వారు అంటున్నారు. వారిలో వారే ఇళ్ల కోసం కొట్టుకుంటున్న సందర్భంలో అమాయక గిరిజనులను వాటి కోసం ఎదురుచూడడం మాదే అవుతుందని వారు తెలుపుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ గృహాలను నమ్ముకునే కంటే గూన పెంకులను నమ్ముకుంటేనే ఫలితం ఉంటుందని గిరిజనులు తెలుపుతున్నారు.
కట్టించిన గృహాలకు అతీగతీ లేదు. కొత్త గృహాలపై ఆశ లేదు
వాసం కన్నయ్య. కన్నాయిగూడెం. గిరిజనుడు
గతంలో మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూమ్ గృహాలకు అతీగతీ లేదు. కొత్తగా గృహాలు నిర్మించి ఇస్తామంటే గిరిజనులు నమ్మేస్థితిలో లేరు. గతంలో నిర్మించిన గృహాలలో కొన్ని గ్రామాల్లో వాటికి విద్యుత్ సౌకర్యం లేదు. మరి కొన్ని గ్రామాల్లో తాగునీటి సౌకర్యం లేదు. మరి కొన్ని గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ సమస్యలు నెలకొన్నాయి.
సంబంధిత గుత్తేదారు పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం తో విసుగు చెందిన లబ్ధిదారులు అసంపూర్తి నిర్మాణాలను తమ సొంత ఖర్చులతో పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ గృహాలపై నమ్మకం లేకనే గూణ పెంకులు పై ఆధార పడి గృహాలు నిర్మించుకుంతున్నం. ఏదో చేస్తుంది అన్న ఆశ లేదని ప్రభుత్వం పై ఆశలు సన్నగిల్లాయి అని ఆయన అంటున్నారు.