నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
వరంగల్ లో ఆదివారం జరిగిన బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజుల ముగింపు సభకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు హుస్నాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మండల కన్వీనర్ దుండ్ర రాంబాబు మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బి సి లకు 70 సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీయే అన్నారు . కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొత్త పింఛన్లు రాక,రేషన్ కార్డులో పేర్లు నమోదు కాక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ, రైతులకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారని మండిపడ్డారు.విద్యార్థులకు స్కాలర్షిప్ లు రాక , ప్రభుత్వ దవాఖానల దుస్థికి,నాణ్యత లేక ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలతో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నయని మండిపడ్డారు.దుర్మార్గపు ప్రభ్యత్వాలను కూల్చడం కోసం బయలుదేరిన బి ఎస్ పి కి అండగా నిలవాలని కోరారు .బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jun,2022 07:38PM