నవతెలంగాణ కంటేశ్వర్
ధర్మారం గ్రామంలోని శ్రీనివెంచర్స్ లోని ప్లాట్ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని ,ఫైనల్ అప్రూవల్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ జూన్ 28న డి .పి. ఓ .ఆఫీసుకు సామూహిక విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి తరలి రావలసిందిగా కోరుతూ ఆదివారం నాందే్ వాడ లోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగిన శ్రీని వెంచర్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీ కార్యదర్శి కే రామ్మోహన్రావు మాట్లాడుతూ సం: లుగా టెక్నికల్ లేఅవుట్ పర్మిషన్ ఇవ్వటంలో అధికారులు అలసత్వాన్ని విడనాడాలని ,వెంచర్ చేసిన యజమానిని పిలిపించి నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం స్థలాలను చూపించి పర్మిషన్ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు . డబుల్ రిజిస్ట్రేషన్ లు జరిగాయని ఆరోపణలు వస్తున్నందున ప్రతి ఒక్కరు తమ ప్లాటు రిజిస్ట్రేషన్ సరి చూసుకోవాలని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో ప్లాట్ ఓనర్స్ అధ్యక్షులు రామ దాసు కార్యదర్శి సాయిలు అధ్యక్షులు దత్తాత్రేయ రావు ,రాములు,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.