నవతెలంగాణ మద్నూర్
2 రోజుల క్రితం మద్నూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైనందుకు నూతన కార్యవర్గానికి టిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధక్షులు సంతోష్ మేస్త్రీ ఆధ్వర్యంలో సోమవారం ఆయన నివాసంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తో సన్మానం చేశారు.మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్ హనుమాన్లు, ఉపాధ్యక్షులు కె బాలాజీ, ప్రధాన కార్యదర్శి ఏ పండరి, సహాయ కార్యదర్శి వి నవనీత్, కోశాధికారి పి నాగేష్ గౌడ్, మండల నూతన కార్యవర్గం తో పాటు సీనియర్ నాయకులు సంగయ్యప్ప, రామ్ మోహన్ రాజు, ఎం శివాజీ, ఆర్ సుభాష్ తదితర జర్నలిస్టులందరికీ టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సంతోష్ మేస్త్రీ శాలువాలతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచి పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉండడం జర్నలిస్టుల ముఖ్య పాత్ర అని పేర్కొన్నారు . ప్రజాసమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరారు. సన్మాన కార్యక్రమం లో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్ హనుమాన్లు మాట్లాడుతూ పార్టీ నాయకులు గా ఎలాంటి సమస్య వచ్చినా జర్నలిస్టుల దృష్టికి తీసుకువస్తే పత్రికలపరంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుశాల్ యూత్, మండల ఉపాధ్యక్షులు సుధీర్, టౌన్ అధ్యక్షులు హనుమంత్, వార్డ్ మెంబర్ జ్ఞానేశ్వర్, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్, ఇతర నాయకులు సాయిలు, భాషాభాయ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jun,2022 03:53PM