రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..
నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ రాష్ట్ర నాయకులు సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ,ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, యూనివర్సిటీలలో పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. వీటన్నింటిని అమలు చేయకుంటే పిడిఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్షయ్ ,ఆకాష్, హనుమాన్లు ,యశ్వంత్, సాయిరాం , వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm