నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్ట్ గా ఎం పద్మ సోమవారం జాయినింగ్ అయినట్టు మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో టైపిస్ట్ పోస్టులో ఎం పద్మను ప్రభుత్వం నియమించినట్టు పేర్కొన్నారు. కార్యాలయ టైపిస్ట్ గా జాయినింగ్ రిపోర్ట్ ను ఎంపీడీవో శ్రీనివాస్ కు అందజేస్తున్న కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య, మండల పరిషత్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ప్రకాష్, జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm