నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన శేఖర్ (43) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండలంలోని అంతంపల్లి గ్రామానికి చెందిన శేఖర్ 18 సంవత్సరాల క్రితం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన దుర్గయ్య కూతురును వివాహం చేసుకొని ఇల్లరికం వెళ్ళాడు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శేఖర్ సోమవారం మృతిచెందాడు. విషయాన్ని తెలుసుకొని తల్లి రాజమణి.. శేఖర్ మృతి పై అనుమానం ఉందని ఆరోపించారు. పంచనామా చేసి అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పొస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm