నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ భూములను డి.ఐ అంబర్ సింగ్ సోమవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చెందిన 50 ఎకరాల భూములను కొలతలు కొలచి హద్దులు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4వ తారీఖున ఆలయానికి సంబంధించిన మిగిలిన భూములను పూర్తి సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మండల సర్వేయర్ కిరణ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, ఆలయ సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm