విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడు కొప్పుల శ్యామ్
మేడారంలో వనదేవతలకు ప్రత్యేక మొక్కులు
నవతెలంగాణ- తాడ్వాయి
ఆదివాసీ ప్రజల భూమి, నీరు, అడవిపై సంపూర్ణ కుల స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం కొన్ని వందల సంవత్సరాలుగా రాజరిక ప్రభుత్వాలతోను, బ్రిటిష్ నిజాం నిరంకుశ పాలన వర్గాలు అనుసరిస్తున్న రాజకీయ దోపిడి విధానాలకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాటం చేసి వీరమరణం పొందిన ఆదివాసి పోరాట యోధుడు కొమురం భీం విగ్రహ ప్రతిష్టాపన ఆగస్టు 9వ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో జరగనుందని, ఈ కార్యక్రమానికి అందరూ మేధావులు, ఆదివాసీలు, ఆదివాసేతర ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధి లు, ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కొమరం భీం విగ్రహ ప్రతిష్టాపన నిర్వహణ కమిటీ, కాల్వపల్లి చైతన్య భారతి యూత్ అసోసియేషన్ నాయకులు కొప్పుల శ్యామ్ అన్నారు. సోమవారం మేడారంలో విగ్రహ ప్రతిష్టాపన విజయవంతం కావాలని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు లకు మొక్కులు చెల్లించి కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ఆదివాసి సామాజిక న్యాయ పోరాటాలకు ఆయన జీవితం మనందరికీ ఒక ఆదర్శం అన్నారు. వారి ఆశయ సాధన కోసం మనమందరం ఉద్యమ కార్యాచరణలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కాల్వపల్లి, చైతన్య భారతి యూత్ అసోసియేషన్ సభ్యులు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, సిద్దబోయిన శ్యామ్, కుడుముల రాజు, కొప్పుల జగన్, పీరిల నరేష్, చిరంజీవి, సతీష్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jun,2022 05:56PM