నవతెలంగాణ-మంథని
మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరంలో కంటి వైద్య నిపుణులు సుమారు 100 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు .కంటి ఆపరేషన్ ఉన్నవారికి ఆపరేషన్ చేస్తామని డాక్టర్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ కుమార్,సర్పంచ్ భీమునిపుష్ప-వెంకటస్వామి, ఉపసర్పంచ్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు సుంకరి శంకర్,ఎరుకల సురేష్,చెరుకుతోట రమేష్,వైద్య సిబ్బంది జాఫర్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm