నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ చౌరస్తా వద్ద సోమవారం ఆటో డ్రైవర్ లకు రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు మద్యం తాగి, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొవద్దని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్లకు పలు సూచనలను సీఐ తిరుపయ్య, ఎస్ఐ ఆనంద్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm