ఉన్నతాధికారులు వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగింపు....
దీక్షకు దిగిన సోమిని శివశంకర్ ప్రసాద్....
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఉన్నత విద్యావంతుడు ప్రజాప్రతినిధి రూపంలో తన సామాజిక వర్గానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ గా ఎన్నికయ్యాడు.మూడేండ్లు అయినా ప్రభుత్వం విదిల్చే అరకొర నిధులతో తన పంచాయితీ పరిధిలోని ఆవాసాలు లో కనీసం మంచినీరు,విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేక పోతున్నాడు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళడం ఒక్కటే మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తానే స్వయంగా నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించుకుని సోమవారం దీక్ష చేపట్టాడు. ఆయనే మండల పరిధిలోని వేదాంతపురం సర్పంచ్ సోమిని శివశంకర్ వరప్రసాద్.
దీక్ష చేపట్టడానికి గల కారణాలు ఆయన మాటల్లోనే...
' సోమవారం వేదాంతపురం పంచాయతీ సర్పంచ్ గా నేను గత మూడు సంవత్సరాలుగా భాద్యతలు వహిస్తున్నాను.గత కొన్నేండ్లుగా మా పంచాయితీ ని పలు సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.ఇందులో ప్రధానమైన సమస్యలు రెండు ఉన్నాయి.
1)తిమ్మాపురం గ్రామానికి మౌలిక వసతుల కల్పించడం అనగా కరెంటు,త్రాగునీరు, రోడ్లు మరియు పంచాయతీ అభివృద్ధి పనులు చేయడానికి అటవీ అధికారుల అనుమతుల నిమిత్తం ప్రజాప్రతినిధులను, అధికార్లను కలిశాను. ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్ట్ అధికారి కలిసి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాను.పనులు మొదలుపెడతాం అని హామీ కూడా ఇచ్చారు కానీ ఫారెస్ట్ అధికారులు తప్పుడు నివేదికల వలన ఆగిపోయింది.
2) వేదాంతపురం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ మరియు ఫారెస్ట్ బౌండరీ నీ గుర్తించి బౌండరీ లోపల ఉన్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం గురించి దీని నిమిత్తం సర్వేలు కూడా జరిగినాయి కానీ ఎటువంటి పాసు పుస్తకాలు కానీ హక్కుపత్రాలు కానీ ఇవ్వలేదు.కనుక ఈ రెండు సమస్యలు తీర్చే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తాను. ఐటిడిఎ పి.ఒవ చ్చే వరకు ఈ యొక్క నిరాహారదీక్ష కొనసాగిస్తాని మీకు తెలియజేస్తున్నాను` అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jun,2022 08:45PM