నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రవీంద్ర గుప్తా పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (కాంట్రాక్టు)టీచర్స్ అసోసియేషన్ దక్షిణ ప్రాంగణం అధ్యాపకుల ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.ఎస్.నారాయణ గుప్తా, డా.చంద్రమౌళి,డా.యాలాద్రి, సునీత, డా.రమాదేవి, డా.నిరంజన్, శ్రీమాత, దిలీప్,ఆసుపత్రి సిబ్బంది షరీఫ్,డా.రాహుల్ నేత,వెంకటేశం గుప్తా,జానా బాయ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm