-గుంతలమైయంగా పోతారం క్రాస్ రోడ్డు
-పోతారం రోడ్డుపై సుమారు 1046 గుంతలు..
-అధ్వానంగా బెజ్జంకి-పోతారం క్రాస్ రోడ్డు దుస్థితి
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు అత్యవసర స్థితుల్లో జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే పోతారం రోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఇప్పుడు అ రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. గతంలో కల్వర్టుల వల్ల ప్రయాణీకుల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా అధికారులు కల్వర్టులకు మరమ్మతులు చేపట్టడంతో ప్రయాణీకులకు ఊరట కలిగింది. అయితే కల్వర్టులకు మరమ్మతులు పూర్తయిన అనతికాలంలోనే రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ప్రయాణీకులకు,ద్విచక్ర వాహనదారులు ఆరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్తున్నారు.మండల కేంద్రంలోని ఎండ్ల బండి చౌరస్తా నుండి పోతారం క్రాస్ రోడ్డు వరకు సుమారు 1046 గుంతలు రోడ్డుపై ఏర్పడ్డాయి. రాత్రివేళల్లో రోడ్డుపై భారీ వాహనాలు వేళ్ళడంతో మండల కేంద్రంలోని శ్మశానవాటిక వద్ద రోడ్డుపై తారు ధ్వంసమైంది.పోతారం క్రాస్ రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారిందని ద్విచక్ర వాహనాదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు,అధికారులు గుంతలమైయమైన రోడ్డును క్షేత్ర స్థాయిలో పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టాలని ద్విచక్ర వాహనదారులు, రేగులపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజా సంక్షేమమే ద్యేయమని చేబుతున్న ప్రజాప్రతి నిధులు గుంతలమైయమైన రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టడానికి చోరవ చూపుతారో లేదో..ప్రయాణికులు వేచిచూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jun,2022 06:13PM