నవతెలంగాణ డిచ్ పల్లి
పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి దినేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్రవ్యాప్తంగా రియంబర్స్మెంట్ ను విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని ఆయన అన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు పై చదువులకి వెళ్లాలంటే ఫీజులు కట్టక అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని.. రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు రంజిత్, అజయ్, మనీష్ , రమేష్ ,సాయి తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jun,2022 06:24PM