నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మంగళవారం కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (291 చెక్కులు 2,91,33,756/-రూ) చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..ప్రతి ఇంటికి పెద్ద దిక్కు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలియజేశరు. మాటలో కాదు చేతల్లో చేసి చూపెట్టే నాయకుడు మన కేసీఆర్ అని తెలిపారు.దేశంలోని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మన తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలు తన చేతుల మీదుగా అందిస్తున్నందుకు గర్వపడుతున్నానన్నారు. కళ్యాణ లక్ష్మీ చెక్కులు తీసుకుంటున్న వధూవరులకి శుభాకాంక్షలు తెలిపారు.
ఆడ బిడ్డలకు గౌరవంగా పెళ్లి చేసి పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకాల అమలుకు శ్రీకారం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న భరోసా తో ఆడ పిల్లల జననం రేటు ఘన నీయంగా పెరిగిందని చెప్పారు. 102 డయల్ చేస్తే గర్భిణులకు ఇంటికి వచ్చి వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారన్నారు. బిడ్డ గర్భంలో ఉన్నపుడు అంగన్ వాడి సెంటర్ లో పౌష్టికాహారం అందిస్తున్నారని చెప్పారు. నగర ప్రజలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గా తనను రెండో సారి అధిక మెజారిటీ తో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. మీరు నామీద అభిమానానికి కళ్యాణ లక్ష్మీ చెక్కు తీసుకొనే వధూవరులకి ఒక చీర-ప్యాంటు షర్టు దుస్తులు ఇస్తున్నాను అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం ఆగి పోయే వరకు ఈ యొక్క కానుక ఇస్తానని చెప్పారు. కరోన కష్ట కాలంలో మొదటి వేవ్ లో మన ప్రాణాలకు కాపాడటానికి వారి ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేసిన వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ మరియు మునిసిపల్ సిబ్బందికి తన సొంత ఖర్చులతో భోజనం అందించానన్నారు. రెండవ వేవ్ లో నగరం ఇంటి దగ్గర మరియు ఆస్పత్రులలో.. కరోన వైరస్ బారిన పడిన వారికి, వారి సహాయకులకి భోజనం వసతి కల్పించాను అని చెప్పారు. నగర ప్రజలకి ఎటువంటి ఆపద వచ్చిన ఒక సోదరుడిలా మీకు అండగా ఉంటానని తెలియచేస్తున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ కార్పొరేటర్ లు, నాయకులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jun,2022 06:48PM