- రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఆరుగురు విద్యార్థులు
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో కాకతీయ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటుకున్నారు. మంగళవారం కాకతీయ గోదావరి క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర స్థాయి లో సత్తా చాటిన విద్యార్థులకు యాజమాన్యము ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ ఇది ఉత్తమ ఫలితాలు వచ్చేలా విద్యార్థులను తీర్చి దిద్దుతున్న మన్నారు గత దశాబ్దకాలంగా కాకతీయ విద్యార్థులు పదోతరగతి ఇంటర్ లో తమ సత్తా చాటుతూ కాకతీయ విద్యా సంస్థల పేరును నిలబెడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు రాబోయే కాలంలో సైతం నైపుణ్యంగల విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారు ఉన్నతస్థాయికి ఎదిగేలా కృషి చేస్తామని అన్నారు రాష్ట్రస్థాయిలో మంగళవారం ఇంటర్లో తమ విద్యార్థులకు ర్యాంకు రావడం అభినందనీయమని ఆయన అన్నారు అనంతరం సత్తాచాటిన విద్యార్థులు మాట్లాడుతూ తన విజయం వెనక తల్లిదండ్రులు అధ్యాపకుల కృషి ఎంతగానో ఉందని రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ విజయాల స్ఫూర్తితోనే భవిష్యత్తు కాలంలో ఉన్నత చదువులు అభ్యసించి తాము చదువుకున్న కళాశాలతో పాటు తల్లిదండ్రుల పేరు నిలబడతామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంటర్ రెండవ సంవత్సరం లో సిహెచ్ సాయి కీర్తన( రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు) 994/1000,ఎల్ వర్శిని,( రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు) 991/1000,వి రోహిత్987/1000,ప్రాణవ్ తేజ986,ఎం. హిమాజ బైపిసి987, విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించారు. అదే విధంగా ఇంటర్ మొదటి సంవత్సరం రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన పి వైష్ణవి 467, (రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు), బి స్రవంతి 467(రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు) కే సాత్విక్ 467(రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు) ఎస్ నక్షత్ర466(రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు) డి అక్షయ466(రాష్ట్రస్థాయిలో 4 ర్యాంకు) వి సాయి అక్షయ465(రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు) కే అక్షర465(రాష్ట్రస్థాయిలో 5 ర్యాంకు) తో పాటు మరో 14 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు ఈ విలేకరుల సమావేశంలో కాకతీయ కళాశాల యాజమాన్యం రజినీకాంత్, రాజు విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది , కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.