- బైపీసీలో స్టేట్ మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని
నవతెలంగాణ కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ విద్య సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కళాశాల జోనల్ ఆఫీసర్ గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ బైపీసీ విభాగంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో సాయి అమృత వర్షినికి 440 కి గాను437 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండడం గర్వకారణమని అన్నారు అదేవిధంగా గా బైపీసీ విభాగంలో440కి గాను436 ఆరుగురు విద్యార్థులు,440కి435 మార్కులను 11 మంది విద్యార్థులు రాష్ట్ర జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించి విజయ దుందుభి మోగించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల అధ్యాపకుల బోధన తల్లిదండ్రుల ప్రోత్సాహం తో పాటు రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి ర్యాంకులు సాధించడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో తాము ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లి తల్లిదండ్రులకు తాము చదువుకున్న విద్యాసంస్థలకు మంచి పేరు తెచ్చే దిశగా తాము ప్రయత్నిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ విజయానికి కారణమైన విద్యార్థుల తల్లిదండ్రులకు, కళాశాల అధ్యాపకులకు ప్రిన్సిపాల్ కు సిబ్బందిని విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల రెడ్డి అభినందించారు. సమావేశంలో ఎస్ ఆర్ కళాశాల జోనల్ ఆఫీసర్ గోవర్ధన్ రెడ్డి ప్రిన్సిపల్స్ అధ్యాపక బృందం సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.