నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో 163 వ జాతీయ రహదారి అభివృద్ధి పనులలో భాగంగా సంబంధిత గుత్తేదారు ఇష్టారాజ్యంగా చెట్లను నరికి వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇదే అదనుగా సంబంధిత కాంట్రాక్టర్ అటవీ అధికారులతో కుమ్మక్కై రహదారి పనులు చేపట్టని ప్రదేశంలో కూడా ఇష్టారాజ్యంగా చెట్లను నరికి లోడు చేసుకుని వెళ్లడం జరిగినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా 163 జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను పరకాల పట్టణానికి చెందిన శరత్ అనే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నరికి అవసరమైన భాగాలను లోడ్ చేసుకుని టింబర్ డిపోకు తరలించారని, అవసరం లేని చోట ముక్కలను, ఆకులను, కొమ్మలను అక్కడే వదిలి వెళ్లడం జరిగిందని పలువురు చెబుతున్నారు. ప్రతిరోజు వర్షాలు కురుస్తుండడం... చెట్ల ఆకులు రాలి మురిగి కంపు వాసన వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజులుగా చెట్ల కొమ్మలను తొలగించక పోవడం వల్ల ఇబ్బందిగా ఉందని, రహదారి వెంట వచ్చి పోయే వారికి, వాహనాలకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలుపుతున్నారు.
అంతేకాక ఇదే అదనుగా సంబంధిత కాంట్రాక్టర్ రహదారి అభివృద్ధి చేయని ప్రాంతంలో కూడా కొందరితో మమేకమై చెట్లను కొట్టించి ఎత్తుకొని వెళ్లినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఎనిమిది వందల మీటర్ల వరకే అభివృద్ధి పనులు నిర్వహిస్తుండగా సుమారు రెండు కిలోమీటర్ల పైబడి కూడా చెట్లను నరుక్కొని తీసుకుపోయినట్లు వారు చెబుతున్నారు. ఈ విషయంలో స్థానిక విద్యుత్ శాఖ అధికారులు మరియు అటవీశాఖ అధికారులు సహకరించినట్లు తెలుపుతున్నారు. రహదారి వెంట ఉన్న వృక్షాలను నరికి వాటి కొమ్ములను రెమ్మలను నివాస గృహాల స్థలాలు వేయడం వల్ల ఇబ్బందిగా ఉందని గృహాల యజమానులు పేర్కొంటున్నారు. అనుమతి లేకుండా చెట్లను నరకడం పై అధికారులు చర్యలు తీసుకోకపోయినా సరే మా గృహాల ముందు పడేసిన చెట్ల కొమ్మల ఆకుల సంగతి ఏంటని కుటుంబాల యజమానులు ప్రశ్నిస్తున్నారు. చెట్ల ఆకులు కొమ్మలు తడిచి దుర్వాసన వేస్తూ ఈగలు దోమలకు ఆవాసం గా మారి వాటి వల్ల సమీప ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా డెంగు వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదని, వైద్య శాఖ అధికారులు వెంటనే సంబంధించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అంతేకాక సంబంధిత కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలి
సంబంధిత గుత్తేదారు ఇస్తారాజంగా చెట్లను నరికి తీసుకుపోవడమే కాకుండా వాటి కొమ్మలను ఆకులను అవసరంలేని భాగాలన్నింటిని మా గృహాల ముందు పడి వేయడం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. గుత్తేదారుకు చెట్లు నరకడంలో సహకరించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు. చెట్ల కొమ్మలు కుప్పలు కుప్పలుగా వేయడం వల్ల వర్షాకాలంలో పాములు తేళ్లు చేరి ఎప్పుడు కాటువేస్తే అన్న భయంతో స్థాణికులు కాలం వెళ్లదీస్తున్నారు. వర్షానికి పచ్చి ఆకులు తడిసి దుర్గంధం వ్యాపిస్తుంది. దోమలు చేరి మలేరియా వంటి వ్యాధులు ఎక్కడ వస్తాయని భయం వ్యక్తం అవుతోంది.
సూడి సతీష్ రెడ్డి
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Jun,2022 05:24PM