నవతెలంగాణ-మంథని
మంథని మండల అభివృద్ధికి తమ శాఖ నుండి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంథని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కొండ శంకర్ బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద మండలంగా కలిగి ఉన్న మంథని మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉన్నాయని, మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి,మంథని మండల అభివృద్ధికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయాలని కొండ శంకర్ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కోరారు. ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm