నవతెలంగాణ-మంథని
మంథని మండలం ఖాన్ సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల కుమారస్వామి,పెరళ.విమల రోడ్డు ప్రమాదంలో మరణించగా,మంథని పట్టణంలోని పోస్టుమార్టం గదుల వద్ద మృతదేహాలను పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుకర్ పరిశీలించారు. అనంతరం వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి గల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.పట్టణంలోని పవర్ హౌస్ కాలనీలో పెంటరి అశోక్, బండి స్వరూప,సరోజన ఇటీవల మరణించగా వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.ఆయన వెంట కేడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్,రైతుబంధు అధ్యక్షులు ఆకుల కిరణ్,మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్,నాయకులు గుండా పాపారావు,నక్క శంకర్,నీలం రమేష్,రాము,తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm