ఆర్డిఓ రమాదేవి.
నవతెలంగాణ గోవిందరావుపేట.
తాసిల్దార్ కార్యాలయంలో ఎలాంటి ఫైలు పెండింగ్ లో ఉండకుండా పనులు చేసుకోవాలని ములుగు ఆర్డిఓ రమాదేవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డిఓ రమాదేవి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డిఓ రమాదేవి మాట్లాడుతూ ధరణికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ లకు సంబంధించి ఫైళ్లను ఆమె పరిశీలించారు. ప్రజావాణి, ఆపద్బంధు, రైతు ఆత్మహత్యలు, వర్షాకాలంలో సంభవించే విపత్తుల గురించి అధికారులతో ఆమె మాట్లాడారు. అధికారులకు ఈ సందర్భంగా ఆమె పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ ఆఫీస్ ఈ హెల్త్ ప్రొఫైల్ తదితర అంశాలపై సిబ్బందితో కూలంకషంగా మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ అల్లం రాజకుమార్ తో పాటు నాయబ్ తాహసిల్దార్. ఆర్ ఐ లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Jun,2022 08:43PM