నవతెలంగాణ మద్నూర్
నాలుగు సంవత్సరాల అబ్బాయి సాయినాథ్ బుధవారం తప్పిపోయాడు. ఆ బాలుడి ఆచూకి గుర్తించిన పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉంచి ఈ సమాచారం వాట్సప్ ద్వారా మండల ప్రజలకు తెలియజేశారు. దాంతో తప్పిపోయిన బాలుడి తల్లిదండ్రులు మద్నూర్ మండలం లోని సలాబత్ పూర్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఉండేవాళ్ళు గా తెలిసింది. తప్పిపోయిన కుమారుడి పోలీసుల వద్ద ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ బాలుడిని పోలీసులు బుధవారం సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు . తప్పిపోయిన బాలుడికి పోలీసులు రక్షణ కల్పించి తల్లిదండ్రుల సమాచారం తెలుసుకొని వారికి అప్పగించినందుకు మద్నూర్ మండల ప్రజలు పోలీసుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm