- మాజీ ఎమ్మెల్యే తాటీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బుధవారం మొదటిసారి నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాణా సంచా కాల్చి,మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అశ్వారావుపేట ప్రధాన కూడలి లో ఉన్న రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. అనంతరం లహరి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొగళ్ళ చెన్నకేశవరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు తాటి రాకను స్వాగతించారు. ఆయన రాకతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉన్న ప్రతీ కార్యకర్తను కలుపుకొని పోవాలని కోరారు.ఎలాంటి గ్రూపులు లేకుండా కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ర్టంలో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందన్నారు. టిక్కెట్ ఎవరికొచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఒక్కటే మన కర్తవ్యం అన్నారు. కార్యక్రమంలో తుమ్మ రాంబాబు, బూసి పాండు, ఎంపిటిసిలు వేముల భారతి,సత్రవరపు తిరుముల, వగ్గెల అనసూయ, వగ్గేల పూజ, కోలా లక్ష్మీనారాయణ, మైనారిటీ అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు పాషా, జుజ్జూరి దుర్గారావు, నాగు, శోభన్ బాబు, సుంకవల్లి వీరభద్రరావు, అంకిత మల్లిఖార్జునరావు, సోడెం కన్నమ్మ, పోట్టా రాజులు,పూనేం వెంకటస్వామి,తలగాని గౌరయ్య పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 29 Jun,2022 09:39PM