నవతెలంగాణ-భిక్కనూర్
గ్రామాలలో మౌలిక సదుపాయాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీపీ గాల్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలో స్థానిక మల్లన్న ఆలయం వద్ద లక్ష రూపాయల ఎంపీటీసీ నిధులతో తవ్వించిన బోరు మోటార్ ను సర్పంచ్ తునికి వేణుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సరస్వతి సువర్ణ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో బోరు తవ్వించి మోటార్ బిగించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి,ఉప సర్పంచ్ బోడ నరేష్, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం, సొసైటీ ఉపాధ్యక్షుడు ముచ్చర్ల రాజిరెడ్డి,రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షుడు మద్దూరి నరసింహులు,వార్డు సభ్యులు కమ్మరి సుజాత,భాను,సిద్ధరాములు,ఆలయ డైరెక్టర్ బసవయ్య, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Jun,2022 06:18PM