- తహసిల్ వద్ద వీఆర్ఏల నిరసన
నవతెలంగాణ-బెజ్జంకి
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పేస్కేల్ హామీని తక్షణమే అమలు చేయాలని గురువారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్ వద్ద వీఆర్ఏలు నిరసన చేపట్టారు.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేసి సీనీయారీటీ ప్రకారం ఆర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయుబ్ తహసిల్దార్ ఎండీ జాఖీర్ మొయినుద్ధీనుకు వినతిపత్రమందజేశారు.మండలంలోని అయా గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.