నవతెలంగాణ - అశ్వారావుపేట
చదువు పై ఇష్టంతో కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఎం.పి.పి శ్రీరామమూర్తి విద్యార్ధులకు సూచించారు. ఇటీవల ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వి.కె.డి.వి.ఎస్ రాజు జూనియర్ కళాశాల విద్యార్ధుల ప్రశంసా కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ది చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు మానవ వికాసం పెంపొందించే బదులుగా వికృత విశేషాలు కు ఉపయోగిస్తున్న ఈ తరుణంలో చదవు విద్యారంగం పై తీవ్ర అననుకూల ప్రభావం ఉందని హెచ్చరించారు.సెల్ ఫోన్ అధిక వినియోగం అనర్ధాలకు తావిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసారు.అనంతరం ఇంటర్ లో అత్యధిక మార్కులు పొందిన అచ్యుతాపురం చెందిన ప్రధమ సంవత్సరం ఎం.పి.సి విద్యార్ధిని కె.మనీషా 465/470,అశ్వారావుపేట కు చెందిన ఎస్.సుకన్య 436/440,సి.ఇ.సి విద్యార్ధిని ఎస్.ప్రసూన గంగోత్రి 482/500,ఎం.ఇ.సి విద్యార్ధిని
కె.జాహ్నవి 472/500, ద్వితీయ సంవత్సరం లో దమ్మపేట మండలం,మందలపల్లికి చెందిన ఎం.పి.సి విద్యార్ధిని వి.పావని శ్రీ 984/1000,అశ్వారావుపేట కు చెందిన విద్యార్ధిని సి.హెచ్.అమృత 981/1000, దమ్మపేట కు చెందిన బై.పి.సి విద్యార్ధిని పి.ప్రవళిక 965/1000 లను చిరు జ్ఞాపికలు,శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు,అచ్యుతాపురం సర్పంచ్ యాట్ల నాగలక్ష్మి,కొల్లు చంద్రశేఖర్,బోధనా సిబ్బంది పాల్గొన్నారు.