నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఎస్సార్ విద్య సంస్థల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష లో గురువారం విడుదల చేసిన ఫలితాలలో విజయంక మోగించారు. ఈ సందర్భంగా ఎస్ అర్ విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ ప్రణీత్ కుమార్ మాట్లాడుతూ..తమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివినందుకు ఇంతటి విజయాలను సాధించారని తమ పాఠశాలకు ఎంతో గర్వకారణం అన్నారు. ఇందుకు సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా 10/10 కి 15 మందికి, 9.8 కి 29 మంది,9.7 కి 36 మంది,9.5కి 36 మంది విద్యార్థులు గ్రేడ్లు సాధించాలని తెలియజేశారు. ఈ విజయం పట్ల ఎస్సార్ విద్యాసంస్థలు ప్రత్యేక దృష్టితో పర్యవేక్షించి ఈ ఫలితాలు సాధించడానికి ద్వారా పడ్డాయని చెప్పడానికి గర్విస్తున్నానని అన్నారు ఈ విజయానికి కారణమైన పాఠశాల అధ్యాపకులకు విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ జోనల్ ఆఫీసర్ గోవర్ధన్ రెడ్డి, ఎస్ ఆర్ జోనల్ ఇంచార్జ్ ప్రణీత్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ ఇశాక్ విద్యార్థులు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.