- కాపర్, ఆయిల్ చోరీ
నవతెలంగాణ: నవీపేట్: మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి శివారులోనీ మూడు ట్రాన్స్ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేసి కాపర్ ఆయిల్ చోరీలకు పాల్పడ్డారు. రైతుల సమాచారం మేరకు ట్రాన్స్కో ఏఈ ప్రవీణ్ సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించారు. దుండగులు ట్రాన్స్ఫారం లను ధ్వంసం చేయడంతో 60 వేల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలాలు నాట్లు వేసే సమయంలో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. విద్యుత్ అధికారులు త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్లను బిగించాలని కోరుతున్నారు.